Rice Price: బియ్యమా.? బంగారమా.? ఇంత రేటా.? రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం.

Updated on: Jan 04, 2024 | 4:17 PM

బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్.

బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్. సన్న బియ్యం బాంబ్ దెబ్బకు మధ్యతరగతి వారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇలాగైతే ఒక్కో గింజను లెక్కబెట్టుకుని పొదుపుగా తినాల్సిందే అని ఆవేదనతో చెబుతున్నారు. అసలు.. బియ్యం రేటు ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి కారణాలు ఏమిటి? మళ్లీ రేటు ఎప్పుడు తగ్గుతుంది?

2019లో కిలో బియ్యం ధర దాదాపు 45 నుంచి 50 రూపాయిల లోపే ఉంది. కానీ ఇప్పుడు కేజీ రైస్ రేటు దాదాపు 65 నుంచి 75 రూపాయిల మధ్య ఉంది. మన దేశంలో ప్రతీ సంవత్సరం సగటున ఒక్కొక్కరూ 102 కేజీల బియ్యాన్ని వినియోగిస్తారు. ఈ లెక్కన చూస్తే.. 102 కేజీలకు ఒక్కో వ్యక్తిపై పడే భారం భారీగానే ఉంటుందని అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నట్టయితే ఇక వాళ్ల నెత్తిన బడ్జెట్ బాంబ్ పడినట్టే. దీంతో బియ్యం కొనాలా.. పస్తులుండాలా.. మధ్యే మార్గంగా.. అర్థాకలితో రోజంతా గడపాలా అన్నది అర్థం కాక సామాన్యులు సతమతమవుతున్నారు. బియ్యం రేటు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. కొన్ని చోట్ల 70 రూపాయిలు దాటితే.. మరికొన్ని చోట్ల 70 రూపాయిల లోపే ఉంది. ఇక మాల్స్ కు వెళ్లి కొనాలంటే జేబు చిరిగినట్టే.. అక్కడ 75 నుంచి 80 రూపాయిల మేర అమ్ముతున్నారు. బియ్యం రేటు ఇంతలా పెరిగిపోవడంతో సామాన్యులకు నోట ముద్ద దిగడమే కష్టమవుతోంది. అందుకే కేంద్రం.. భారత్ బియ్యం పేరుతో కిలో 25 రూపాయిల చొప్పున మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. నిజానికి పంట చేతికొచ్చే సమయంలో బియ్యం ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఖరీఫ్ పంట వస్తున్నా.. రైస్ రేటు మాత్రం తగ్గలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. మార్కెట్లో దీని ధర ఇంకా పెరిగే సూచనలే ఉన్నాయి.

ఇప్పుడు మార్కెట్లో చూస్తే.. క్వింటాకు 4000 నుంచి 4500 రూపాయిలు పలుకుతోంది. అదే పాత బియ్యం అయితే.. 5200 నుంచి 5600 వరకు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఓ వెయ్యి రూపాయిలు ఎక్కువే ఉంది. అంటే సుమారుగా 25 నుంచి 26 శాతం మేర రేటు పెరిగిందన్నమాట. పాత బియ్యం 25 కేజీల బస్తా కావాలంటే.. ఎలా లేదన్నా దాదాపు 1500 రూపాయిలు పెట్టాల్సిందే. సూపర్ ఫైనా్ సన్నబియ్యం కేజీ కావాలంటే.. 70 రూపాయిలు అంటున్నారు. అంటే సామాన్యుడు ఏం తినాలి? ఎలా బతకాలి? తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. ఏపీలో కోస్తాలో సాగు అధికంగా ఉంటుంది. అంటే నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు ఈ లిస్టులో ఉంటాయి. కానీ 2019లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ కూడా వరిసాగు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. దీనికి ఓ ఉదాహరణను చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో 32 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తే.. తెలంగాణలో 65 లక్షల ఎకరాల్లో వరినాటు పడింది. అయినా మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల పంట పూర్తిగా చేతికి రాని పరిస్థితి. బియ్యం ధర పెరగడానికి ఇది కూడా ఓ కారణం. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా.. సామాన్యుడికి మూడు పూటలా ముద్ద దిగాలంటే.. అన్నం ఉడకాలి. దానికి బియ్యం కావాలి. దానికి డబ్బులు కావాలి. కానీ కేజీ రైస్ ఇంత రేటు ఉంటే.. దానిని కొనేదెలా? తినేదెలా?

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow Us