Precautions for dog bites: కుక్క కరిస్తే.. లైట్‌ తీసుకుంటున్నారా.. జాగ్రత్త..! ఇవి మాత్రం తప్పక చెయ్యండి..(వీడియో)

ఇటీవల వీధికుక్కల స్వైర విహారం ఎక్కువైపోయింది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వీధికుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నా వీధి కుక్కలు వెంటపడటం.. కరవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా కుక్క కాటుకు గురైతే ఏమి చేయాలనేదానిపై

Anil kumar poka

|

Jan 19, 2022 | 9:12 PM


ఇటీవల వీధికుక్కల స్వైర విహారం ఎక్కువైపోయింది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వీధికుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత అప్రమత్తంగా ఉన్నా వీధి కుక్కలు వెంటపడటం.. కరవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా కుక్క కాటుకు గురైతే ఏమి చేయాలనేదానిపై నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కుక్క కరిచినప్పుడు దాని పళ్లు చర్మం లోపలికి చొచ్చుకుపోయి రక్తం బయటకు వస్తుంది. ఈ క్రమంలో శరీరంలో రాబిస్ బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది. ఇలా కుక్క చేసిన గాయం పెద్దగా ఉంటే రాబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనే ఇంక్షన్‌ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ గాయం చుట్టూ చేస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా నియంత్రణ లోకి వస్తుంది. కుక్కకాటు చాలా ప్రమాదకరం ఎందుకంటే భవిష్యత్తులో దాని వల్ల రేబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికీ కుక్కకాటుకు నాలుగైదు ఇంజక్షన్లు వేస్తున్నారు.

కుక్క కాటుకు గురైన వెంటనే మొదట గాయం ఉన్న ప్రదేశాన్ని సబ్బు.. గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. రక్తం వస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో శుభ్రమైన గుడ్డ లేదా దూదిని ఉంచండి. గాయాన్ని శుభ్రం చేసిన వెంటనే వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు వెళ్లాలి. కరచిన కుక్క సజీవంగా ఉందో లేదో తెలుసుకోవడానికి 10 రోజుల పాటు దానిపై ఓ కన్నేసి ఉంచండి. గ్రామీణప్రాంత ప్రజలు కొంతమంది నాటు వైద్యుడి వద్దకు వెళ్లి గాయానికి కుట్లు వేయిస్తారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. అలాగే కొందరు గాయంపైన కారం పొడి, తేనె, ఉల్లిపాయ రసంలాంటివి రాస్తారు. పొరబాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు. తక్షణం డాక్టర్ వద్దకు వెళ్లి ఆయన సలహా మేరకు మాత్రమే మందులు వాడడం మంచిది. కుక్క కాటుకు గురైనప్పుడు యాంటీ-రేబిస్ టీకాను వేయించుకున్నట్లయితే, ప్రమాదం తప్పినట్టే.. ఎట్టి పరిస్థితిలోనూ కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దు.. ఇంటి వైద్యానికి ప్రయత్నించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు..అయితే కుక్క కాటుకు గురైన వారిలో రేబిస్ వ్యాధి లక్షణాలు కొన్ని నెలల్లోనే కనిపిస్తే, కొందరిలో కొన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. రేబిస్‌ సోకినవారికి హైడ్రోఫోబియా వస్తుంది. అంటే వీరు నీరుని చూస్తే చాలా భయపడతారు. గొంతులో ఊపిరిపోయే భావన ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ రోగి వెలుగును చూసినా భయపడతాడు. చీకటిలో జీవించడానికి ఇష్టపడతాడు. ముక్కు, నోటి నుంచి నిరంతరం లాలాజలం వస్తుంది. కాలక్రమేణా ఒంటిలో నొప్పులు మొదలవుతాయి. మొదట వెన్నెముక నుంచి ప్రారంభమై శరీరం అంతటా వ్యాపిస్తాయి. అనేకమంది రేబిస్ నుండి కోలుకోలేక మరణిస్తున్నారు. అందుకే కుక్క కాటును అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహాను అనుసరించి, చికిత్స పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu