Health Tips: 14 ఏళ్ళు దాటిన ఆడ పిల్లల్లో సమస్యలు .. ఏ వైద్యుడ్ని సంప్రదిస్తే మంచిది..!
ఆడ పిల్లల్లో 14 నుంచి 18 ఏళ్ళ మధ్య కౌమార దశ ఎంతో ముఖ్యం. ఈ సమయంలో వారిలో శారీరకంగా, మానసింగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వయసులో అనేక అనుమానాలు కూడా ఉంటాయి.
ఆడ పిల్లల్లో 14 నుంచి 18 ఏళ్ళ మధ్య కౌమార దశ ఎంతో ముఖ్యం. ఈ సమయంలో వారిలో శారీరకంగా, మానసింగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ వయసులో అనేక అనుమానాలు కూడా ఉంటాయి. కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. వారిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. చిన్నపిల్లలు కాదు కాబట్టి.. పిల్లల డాక్టరు దగ్గరికి తీసుకెళ్లలేరు. అలాగే పెద్దవారు కాదు కాబట్టి.. గైనకాలజిస్టును సంప్రదించ లేరు. ఈ దశలో ఉన్న పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఎలాంటి వైద్యులను సంప్రదించాలనేదానిపై నిపుణులు సలహాలు ఇస్తున్నారు. నెలసరి ప్రతి నెలా రావడానికి కారణాలేంటి? పునరుత్పత్తి పై ఈ వయసు ఆడపిల్లల్లో అవగాహన పెంచడం ముఖ్యం. పీరియడ్స్ కౌన్సెలింగ్ కోసం తల్లి తన కూతురిని గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడం మంచిది . ఒక్కోసారి అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు, 14 సంవత్సరాలు నిండిన ఆడ పిల్లల్లో రొమ్ము పరిమాణంలో మార్పులు రాకపోతే, రొమ్ము, గర్భాశయం, అండాశయం మొదలైన వాటిపై అవగాహన కోసం గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
