OnePlus 10T: సోషల్‌ మీడియాలో వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ హల్‌చల్‌.. 150డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో..

వ‌న్‌ప్లస్ 10టీ ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తోంది. కారణం ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ వివరాలు ఆన్‌లైన్‌లో లీక‌య్యాయి. వ‌న్‌ప్లస్ 10 ప్రొ 5జీ త‌ర్వాత వ‌న్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం

OnePlus 10T: సోషల్‌ మీడియాలో వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ హల్‌చల్‌.. 150డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో..

|

Updated on: Jun 21, 2022 | 4:39 PM


వ‌న్‌ప్లస్ 10టీ ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తోంది. కారణం ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌ వివరాలు ఆన్‌లైన్‌లో లీక‌య్యాయి. వ‌న్‌ప్లస్ 10 ప్రొ 5జీ త‌ర్వాత వ‌న్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. వ‌న్‌ప్లస్ 10టీ 5జీ ప్రొడ‌క్షన్‌ జులైలో ప్రారంభం కానుంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ వ‌న్‌ప్లస్ 10 ప్రొలా ఉంది. ఎల్ఈడీ మాడ్యూల్ పొజిష‌న్ స్థానంలో లెన్స్ ఇచ్చారు. 150 డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. కెమెరా విషయానికొస్తే 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌తో వ‌న్‌ప్లస్ 10టీ 5జీ క‌స్టమ‌ర్లకు అందుబాటులోకి రానుంది. 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుందని తెలిసింది. 6.7 ఇంచ్ పుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. ఇక వ‌న్‌ప్లస్ 10టీ 5జీ .. ఆక్సిజ‌న్ ఓఎస్ 12పై ర‌న్ అయి వర్క్ చేస్తుంది. అయితే ఈ ఫోన్‌ డిజైన్‌ ఎలా లీక్‌ అయిందో తెలియడం లేదని కంపెనీ చెబుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్‌.. భార్యబాధితులు వింత పూజలు వైరల్‌ అవుతున్న వీడియో..

Follow us