Sleeping Problem: నిద్రలేమితో మందగిస్తున్న జ్ఞాపక శక్తి.. పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!(వీడియో)
నిద్ర తక్కువగా ఉన్నవారికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తక్కువ నిద్రపోయే వారిలో ఆలోచన శక్తి, అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుందని పరిశోధకులు పలు పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.
నిద్ర తక్కువగా ఉన్నవారికి వివిధ రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే తక్కువ నిద్రపోయే వారిలో ఆలోచన శక్తి, అర్థం చేసుకునే కెపాసిటీ తగ్గిపోతుందని పరిశోధకులు పలు పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు. నిద్రలేమితనం మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు నిద్రించాలి.. తక్కువ నిద్రపోయినట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయంపై పరిశోధనలు నిర్వహించారు. చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా ప్రతి రోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రించడం ఉత్తమమని చెబుతున్నారు. ఇన్ని గంటలు నిద్రిస్తే మెదడుపై సానుకూలమైన ప్రభావం ఉంటుందని, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, పలు విషయాలను అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేయడం వంటివి తలెత్తడం అల్జీమర్స్ వ్యాధి లక్షణాలేనని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రకు అల్జీమర్స్ వ్యాధికి సంబంధం ఉందని పరిశోధనలలో వెల్లడైంది. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలైనా నిద్రించాలని సూచిస్తున్నారు. రాత్రి సమయంలో నిద్ర రాకపోతే శ్వాస పద్ధతిని అనుసరించడం మంచిదని, యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ వెయిల్ ఈ సూత్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్దతిని పాటిస్తే త్వరగా నిద్ర వస్తుందని అంటున్నారు. ఆ పద్దతిని పాటించలంటే నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని, నాలుక ముందు భాగాన్ని అంగిలిని తాకేలా దంతాల వెనుక ఉంచాలి. ఇలా చేయడం వల్ల త్వరగా నిద్ర వస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇంకా నిద్రలేమితనంతో బాధపడేవారు గోరువెచ్చని పాలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందట.
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

