AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Passengers: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.! ఏసీ కోచ్‌లో ఆర్‌ఏసీ టికెట్‌ ప్రయాణికులకు బెడ్‌రోల్స్

Train Passengers: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.! ఏసీ కోచ్‌లో ఆర్‌ఏసీ టికెట్‌ ప్రయాణికులకు బెడ్‌రోల్స్

Anil kumar poka

|

Updated on: Dec 25, 2023 | 7:29 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లోల ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఇక నుంచి ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది.

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లోల ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రైల్వే ఏసీ కంపార్ట్​మెంట్లలో ప్రయాణించే ఆర్​ఏసీ ప్యాసింజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్​ రైల్వే. ఇక నుంచి ఆర్​ఏసీ టికెట్​ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్​ రోల్​ కిట్​ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్​ చెప్పారు. ఈ కిట్​లో ఒక బెడ్​షీట్​, దుప్పటి, టవల్​తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఇది ఏసీ ఛైర్​ కార్​ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.

ఆర్‌ఏసీలో ప్రయాణికుడికి సైడ్ లోయర్ బెర్త్ అందిస్తుంది. ఇందులో ఇద్దరు ప్రయాణికుల టిక్కెట్లు ఏకకాలంలో నిర్ధారించడం జరుగుతుంది. తద్వారా సైడ్ లోయర్ బెర్త్ ను కుర్చీలా మార్చుకుని దానిపై కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. ఏసీ కోచ్‌లలో అలాంటి ప్రయాణికులకు బెడ్‌రోల్ సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో ప్రయాణంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే రైళ్లలో ఏసీ తరగతుల్లో ఆర్‌ఏసీ టికెట్లపై ప్రయాణిస్తున్నవారికి కూడా బెర్తులు ఖరారైనవారితో సమానంగా సీట్లు ఖాయమైనవారినీ చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. బెడ్‌రోల్‌ ఛార్జీని ఆర్‌ఏసీ ప్రయాణికులు టికెట్‌ రుసుముతో పాటు చెల్లిస్తున్నారని, అందువల్ల వారందరికీ ఈ సదుపాయం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. RAC టికెట్ హోల్డర్‌లకు ప్రయాణ సమయంలో పూర్తి బెడ్‌రోల్ కిట్ సదుపాయాన్ని కూడా అందించాలని రైల్వే బోర్డు 18 డిసెంబర్ 2023న తన అన్ని జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు లేఖను జారీ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.