WhatsApp new feature: వాట్సాప్ ‘డు నాట్ డిస్టర్బ్ మోడ్’..మిస్డ్‌కాల్ అప్‌డేట్‌తో.. ఎలానో చూడండి.
ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించేలా కంపానియన్ మోడ్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దీంతోపాటు డు నాట్ డిస్టర్బ్ మోడ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేయనుంది.
ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించేలా కంపానియన్ మోడ్ ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. దీంతోపాటు డు నాట్ డిస్టర్బ్ మోడ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా యూజర్లకు పరిచయం చేయనుంది. తాజాగా ఈ ఫీచర్‌లో మరో కీలక అప్‌డేట్‌ను బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్‌కు సాధారణ మిస్డ్‌కాల్ అలర్ట్ తరహా ఫీచర్ వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ముఖ్యమైన పనికి కాల్/మెసేజ్/నోటిఫికేషన్లతో డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచుతాం. ఇదే తరహాలో వాట్సాప్ డు నాట్ డిస్టర్బ్ డిఎన్‌డీ మోడ్ పనిచేస్తుంది. యూజర్ ఈ మోడ్‌ను ఎనేబుల్ చేసిన తర్వాత వాట్సాప్‌లో ఎలాంటి మెసేజ్/కాల్స్ వచ్చినా యూజర్‌కు కనిపించవు. దీంతో ఎవరు, ఎప్పుడు కాల్ చేశారనేది తెలియదు. కొత్త అప్‌డేట్‌లో మిస్డ్‌కాల్ వివరాలు యూజర్‌కు చాట్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. సాధారణ మిస్డ్‌కాల్ అలర్ట్ తరహాలో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం డీఎన్‌డీ మోడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..