Cranberry Juice Benefits: నిద్రలేమితో బాధపడుతున్నారా….అయితే ఇలా చేయండి..

|

Jun 29, 2022 | 8:53 PM

క్రాన్‌బెర్రీని గూస్‌బెర్రీ అని కూడా అంటారు. క్రాన్‌బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యానికి ఎంతో మంచివన్నసంగతి తెలిసింది.


క్రాన్‌బెర్రీని గూస్‌బెర్రీ అని కూడా అంటారు. క్రాన్‌బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్యానికి ఎంతో మంచివన్నసంగతి తెలిసింది. వీటిని పళ్లుగానే కాకుండా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. ఈ పండ్ల జ్యూస్‌ ఎంతో రుచిగా ఉండటమే కాదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు ఈ జ్యూస్‌ చాలాబాగా పనిచేస్తుంది. దీనిలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాదు క్రాన్‌బెర్రీ జ్యూస్ జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుందట. క్రాన్‌బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధులనుండి రక్షించడానికి సహాయపడతాయి. క్రాన్‌బెర్రీలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. క్రాన్బెర్రీ జ్యూస్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. PCOSతో బాధపడుతున్న మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. నిద్రలేమితో ఇబ్బందిపడేవారికి ఇది మంచి ఔషధమని చెప్పొచ్చు. నిద్రపోయే ముందు క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల చక్కగా నిద్రపడుతుందట. అంతేకాదు. క్రాన్‌బెర్రీ జ్యూస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది. ఒక నివేదిక ప్రకారం.. క్రమం తప్పకుండా క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల UTI ప్రమాదం 30 శాతం వరకూ తగ్గినట్లు తెలుస్తోంది. అలాగే ఈ జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, వృద్ధాప్యపు లక్షణాలను నివారిస్తుందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Kacha Badam on flute: వేణువుపై కచ్చాబాదం సాంగ్‌ పాడిన యువకుడు.! నెట్టింట రచ్చ లేపుతున్న వీడియో..

Follow us on