ఆందోళనలో డాక్టర్స్.. కరోనా ట్రీట్మెంట్ లో కన్‌ఫ్యూజన్.. బయటపడుతున్న కొత్త లక్షణాలు..:Corona Third Wave Video.
కోవిడ్ 19 ఆస్పత్రులకు వస్తున్న కొంతమంది పేషెంట్లలో కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. డయేరియా(విరేచనాలు),వాంతులు,తలనొప్పితో వస్తున్న పేషెంట్లలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.దీంతో కొత్త కేసుల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...
నమ్మకంలేని చోట… మానవ సంబంధాలే కాదు.. చివరికి మందులు కూడా పనిచేయవా? అవును ఇప్పుడు కరోనా వైద్యంలో ఇదే కన్పిస్తోంది. రెండేళ్లు కావస్తున్నా రేండు వేవ్‌లు అటాక్ చేసినా.. ఇంకా ట్రీట్మెంట్ లో కన్‌ఫ్యూజన్. ఏం మందులు వాడాలి.. ఏం వైద్యం చేయాలి? ఈ పరిస్థితే ఇప్పుడు కరోనా రోగుల్లో సైకో న్యూరో ఇమ్యునాలజీ గా వెంటాడుతోంది. ఇంతకీ సైకో న్యూరో ఇమ్యునాలజీ ఏంటి? వైద్యులేమంటున్నారు.
కరోనాకు ఆరంభమే కానీ.. అంతం కనిపించడంలేదు. వైరస్ వ్యాపించి రెండేళ్లు గడచిపోతోంది. ఇప్పటికే రెండు వేవ్ లు దాడిచేసి.. మూడో వేవ్ అటాక్ త్వరలో అనే భయాందోళనలు వెంటాడుతున్నాయి. సరైన సమయంలో వైద్యం అందకో.. ఆక్సిజన్ కొరతో ఇలా అనేక ప్రాణాలను బలితీసుకుంది. అయితే.. ఇప్పుడు యావత్ వైద్య రంగం ఒక కన్ ఫ్యూజన్ లో ఉంది. ఇంత కాలం గడచినా.. కరోనా వైద్యానికి ఒక ప్రామాణికం లేదు. కరోనా పరీక్షల నుంచి వైద్యంలో వివిధ మందులు, రెమడెస్ వీర్ లాంటి ఇంజనక్షన్లు వాడాలా వద్దా ? ఈ కన్‌ఫ్యూజన్.. వైద్యులను సైతం గందరగోళ పరుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఈ పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్..!ఇందులో నిజమెంత..?తెలుసుకోండి..:Check For Sugar Video.