వీడి ధైర్యానికి ఫిదా..! అరుదైన కొండచిలువ కలకలం ట్విస్ట్ ఏంటంటే..?వైరల్ అవుతున్న వీడియో.. :Python Viral Video.

పాము కనిపిస్తే.. కొంచెం భయం వేసినా ఏ కర్ర పట్టుకుని కొట్టి చంపడమో.. చప్పుడు చేసి బెదిరించి పంపేయడమో చేస్తాం. కానీ కొండచిలువ కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. సలాం సెంటర్‌లో ఒక్కసారిగా రోడ్డుపై ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు...

Anil kumar poka

|

Aug 20, 2021 | 5:10 PM

రద్దీగా ఉండే రోడ్లపై ఉన్నట్టుండి పాము ప్రత్యక్షమైతే…ఎలా ఉంటుంది..? ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది..పాము అంటే..అలాంటి ఇలాంటిది కాదు..ఏకంగా నడిరోడ్డుపై అతి పొడవైన భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన జనాలు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సలాం సెంటర్‌ వద్ద భారీ కొండ చిలువ హల్‌చల్‌ చేసింది. ఎట్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక్కసారిగా రోడ్డుపై కనిపించిన కొండచిలువను చూసి.. స్థానిక ప్రజలు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. అయితే, ఆ పాము కూడా…జనాల అలికిడితో భయపడిపోయింది..నివాసాల మధ్యకు పారిపోయే ప్రయత్నం చేసింది. దీంతో స్థానికులు మరింత కంగారుపడిపోయారు. వెంటనే కొండచిలువను కర్రలతో కొట్టి చంపేశారు. సుమారు 11 అడుగులకు పైగానే ఉన్న భారీ కొండచిలువ ఇళ్ల మధ్యకు వస్తుండగా, భయంతోనే దాన్ని చంపేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, చనిపోయిన కొండచిలువని ఓ వ్యక్తి మెడలో వేసుకొని ఫొటోలు దిగడం చర్చనీయాంశంగా మారింది.


మరిన్ని ఇక్కడ చూడండి : అఫ్గాన్‌ మహిళల ఆక్రందన హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్న వీడియోలు..:Afghan Womens Video.

 70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

 Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu