Nasa programme: ‘నాసా’ లో సత్తా చాటిన పాలకొల్లు యువతీ.. స్పేస్‌ ప్రోగ్రాంలోకి ఆంధ్ర అమ్మాయి.. (వీడియో)

Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి అనే బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్‌ ఆపరేషన్స్ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏఎస్పీ)లో చోటు దక్కించుకుంది.

Nasa programme: 'నాసా' లో సత్తా చాటిన పాలకొల్లు యువతీ.. స్పేస్‌ ప్రోగ్రాంలోకి ఆంధ్ర అమ్మాయి.. (వీడియో)

|

Updated on: Jan 12, 2022 | 9:44 AM

Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి అనే బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థిని అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. అమెరికాలోని అలబామాలో ఉన్న నాసా లాంచ్‌ ఆపరేషన్స్ కెన్నడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం (ఐఏఎస్పీ)లో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా జాహ్నవి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. జాహ్నవి ఇప్పటికే కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో వ్యోమగామిగా జీరో గ్రావిటీ, అండర్‌ రాకెట్‌ లాంచ్, ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపడం వంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసింది. అంతేగాక ‘టీమ్‌ కెన్నెడీ’ మిషన్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించనుంది.ఇదిలా ఉంటే జాహ్నవి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. చిన్ననాటి నుంచి అంతరిక్ష రంగంపై ఆసక్తితో ఉండే జాహ్నవి ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా బీటెక్‌ చేయడానికి పంజాబ్‌లోని ఎల్‌పీయూ యూనిర్సిటీలో చేరింది. సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలో నాసా లాంచ్‌ ఆపరేషన్స్‌ కెనడీ స్పేస్‌ సెంటర్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాంకు జరిగిన ఎంపికల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆన్‌లైన్‌లో రెండు సార్లు ఇంటర్వ్యూలు చేసిన అనంతరం జాహ్నవిని ఎంపిక చేశారు. ఇలా జాహ్నవితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 మంది ఎంపికయ్యారు. భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా జాహ్నవి నిలిచింది. అంతరిక్ష రంగంలో అత్యున్నత స్థానానికి చేరడమే తన లక్ష్యమని చెబుతోన్న జాహ్నవి.. సివిల్‌ పైలట్‌గా స్థిర పడాలనేది తన ఉద్దేశమని చెబుతోంది.

Follow us
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో