కిమ్ వారసురాలా? కిమ్ జు యే టాలెంట్ ఏంటి?వీడియో
ఇటీవల చైనా మిలటరీ పరేడ్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా 26 దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. వీరిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన 13 ఏళ్ల వయసున్న చిన్న కూతురితో హాజరుకావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో కిమ్ వారసురాలు ఆమే అంటూ జరుగుతోన్న ప్రచారానికి బలం చేకూరినట్టయ్యింది. మూడేళ్ల కిందట కిమ్‌తో కలిసి ఖండాంతర క్షిపణి పరీక్షకు హాజరైన పదేళ్ల ఆ బాలిక అప్పట్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
కిమ్ తన కుమార్తె కిమ్ జుయేతో కలిసి బుల్లెట్ రైల్లో ప్రయాణించి చైనాలోని బీజింగ్‌కు చేరుకున్నారు. అక్కడ చైనా నిర్వహించిన సైనిక కవాతుకు వారు హాజరయ్యారు. కాగా, ఆ బాలికే రాబోయే రోజుల్లో ఉత్తర కొరియా పాలకురాలు అయ్యే ఛాన్స్ ఉందని.. ఉత్తర కొరియా దాయాది దేశమైన దక్షిణ కొరియా నిఘా వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. కానీ, ఆది నుంచి పురుషాధిక్యత గల కిమ్ కుటుంబంలో ఓ యువతికి పగ్గాలు అప్పగిస్తారా? అనే అనుమానం పలు దేశాల మనసులో ఉంది. ఉత్తర కొరియాలో ‘గౌరవనీయ’ అనే పదాన్ని అత్యున్నత స్థాయి అధికారులకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా, ఇటీవలి కాలంలో.. కిమ్ స్వయంగా ‘రెస్పెక్టెడ్ కామ్రెడ్’ అంటూ తన రెండో కూతురిని సంబోధిస్తున్నారని, కిమ్ కుటుంబంలో.. వారసత్వ స్థానం బలపడిన కారణంగానే అధ్యక్షుడు అలా పిలుస్తున్నాడని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అలాగే..తమ దేశంలో …కిమ్ జూ ఏ అనే పేరున్న వారంతా తమ పేర్లను మార్చుకోవాలని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదేశించిందని 2023 ఫిబ్రవరిలో రేడియో ఫ్రీ ఆసియా సంస్థ రిపోర్ట్ చేయటమూ ఈ అనుమానాలకు తావిస్తోంది. ఆ బాలికకు గుర్రపు స్వారీ, స్కీయింగ్, ఈత అంటే ఇష్టమని, ఆమె పేరు ఏ విద్యా సంస్థలోనూ నమోదు కాలేదని, ఆమె ఇంట్లోనే ఉంటూ హోం-స్కూలింగ్ చదువుతోందని తెలిసింది. కిమ్ జూ ఏకు ఒక అన్న, ఒక తమ్ముడు లేదా చెల్లి కూడా ఉన్నారనే వార్తలూ వినిపించినా.. వారెవరూ ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఇరగదీసిన అమ్మాయిలు..కుర్చీ మడతబెట్టి పాటకు అదిరిపోయే స్టెప్స్ వీడియో
పండగ స్పెషల్.. అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్.. వీడియో
ఈ ఐఏఎస్‌ల పెళ్లి ఖర్చు.. కేవలం రెండు వేలే వీడియో
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్‌లోని కీలకాంశాలు మీకు తెలుసా? వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
