హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు షురూ
9 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేషుడు గంగ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. హుస్సేన్ సాగర్‌లో భారీ గణపతి నిమజ్జనం చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి.మహాగణపతి విగ్రహం సుమారు 60 నుంచి 70 టన్నుల బరువు ఉండడంతో అంత బరువును మోయగల 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ టస్కర్ ను సిద్ధం చేస్తున్నారు.
9 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడా గణేషుడు గంగ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. హుస్సేన్ సాగర్‌లో భారీ గణపతి నిమజ్జనం చేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి.మహాగణపతి విగ్రహం సుమారు 60 నుంచి 70 టన్నుల బరువు ఉండడంతో అంత బరువును మోయగల 26 చక్రాలు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ టస్కర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భారీ టస్కర్ పై వెల్డింగ్ పనులు ప్రారంభించారు. విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేశారు. ఇక గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్డు తొలగింపు పనులు కూడా ప్రారంభించారు. అదే విధంగా బడా గణేశుడి చెంతన ప్రతిష్ఠించిన కన్యక పరమేశ్వరి, జగన్నాధ స్వామి, లక్ష్మి సామెత హరిగ్రియ స్వామీ, గజ్జలమ్మ దేవి కోసం హైదరాబాద్ కు చెందిన మరో ట్రక్ ను సిద్ధం చేస్తున్నారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Little Hearts Review: నిబ్బా..నిబ్బి..లవ్ స్టోరీ.. హిట్టా..? ఫట్టా..?
హైదరాబాద్‌లో ఇంటి అద్దెలకు రెక్కలు
