Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!

|

Sep 20, 2023 | 9:51 AM

భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. బెర్తుల కేటాయింపుల్లో మార్పులు చేసింది. రోజూ లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. నచ్చిన సీట్ల కోసం నెల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటారు. రైళ్లలో చాలామంది సహజంగా లోయర్ లేదా సైడ్ లోయర్ బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటుంటారు. కానీ ఇకపై అలా జరగకపోవచ్చు. రైళ్లలో లోయర్ బెర్త్ కేవలం కొంతమందికే కేటాయించనున్నారు. రైళ్లలో లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ అనేది కేవలం వికలాంగులకే వర్తించనుంది.

భారతీయ రైల్వే కీలకమైన నిర్ణయం తీసుకుంది. బెర్తుల కేటాయింపుల్లో మార్పులు చేసింది. రోజూ లక్షలాదిమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. నచ్చిన సీట్ల కోసం నెల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటారు. రైళ్లలో చాలామంది సహజంగా లోయర్ లేదా సైడ్ లోయర్ బెర్త్ ఆప్షన్ ఎంచుకుంటుంటారు. కానీ ఇకపై అలా జరగకపోవచ్చు. రైళ్లలో లోయర్ బెర్త్ కేవలం కొంతమందికే కేటాయించనున్నారు. రైళ్లలో లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ అనేది కేవలం వికలాంగులకే వర్తించనుంది. రైల్వే బోర్డ్ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు అంటే రెండు లోయర్, రెండు మిడిల్ సీట్లు, ఏసీ థర్డ్ క్లాస్‌లో రెండు, స్లీపర్ తరగతిలో రెండు సీట్లను వికలాంగులకు కేటాయించారు. అదే సమయంలో గరీబ్ రథ్ రైలులో రెండు లోయర్, రెండు అప్పర్ సీట్లను వికలాంగులకు కేటాయించారు. దీంతోపాటు సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ కేటాయించనున్నారు. స్లీపర్ తరగతిలో 6-7 లోయర్ బెర్త్‌లు, థర్డ్ ఏసీలో 4-5 లోయర్ బెర్త్‌లు, సెకండ్ ఏసీలో 3-4 లోయర్ బెర్త్‌లు గర్భిణీ మహిళలకు, 45 ఏళ్లు పైబడినవారికి కేటాయిస్తారు. ఏ విధమైన ఆప్షన్ లేకుండానే వారికి ఈ సీట్లు కేటాయించనున్నారు. మరోవైపు టికెట్ ఒకవేళ సీనియర్ సిటిజన్, గర్బిణీ లేదా దివ్యాంగులు అప్పర్ సీట్‌లో ఉంటే టీటీ వారికి లోయర్ బెర్త్ కేటాయించవచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్‌1 సూర్యుడి దిశగా ప్రయాణం !!

బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!

దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు

Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు

Taapsee Pannu: లగ్జరీ కారును కొన్న తాప్సీ.. ధర తెలిస్తే షాక్ !!

Follow us on