Birth Certificate: అక్టోబర్ 1 నుంచి బర్త్ సర్టిఫికేట్ కొత్త రూల్స్ !!
భారతదేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్‌కు కూడా అదే రకమైన గుర్తింపుగా కీలకం కానుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని రకాల అవసరాలకు బర్త్ సర్టిఫికేట్‌ను సింగిల్ డాక్యుమెంట్ గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఓ మనిషి పుట్టినప్పటి నుంచి చదివేందుకు స్కూల్, కాలేజీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో సహా ఇతర ప్రభుత్వ రంగ సేవల కోసం ఈ డాక్యుమెంట్ ను అందజేస్తే సరిపోతుంది.
భారతదేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డుకు ఎంత ప్రాధాన్యం ఉందో.. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్‌కు కూడా అదే రకమైన గుర్తింపుగా కీలకం కానుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని రకాల అవసరాలకు బర్త్ సర్టిఫికేట్‌ను సింగిల్ డాక్యుమెంట్ గా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఓ మనిషి పుట్టినప్పటి నుంచి చదివేందుకు స్కూల్, కాలేజీలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డుతో సహా ఇతర ప్రభుత్వ రంగ సేవల కోసం ఈ డాక్యుమెంట్ ను అందజేస్తే సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త చట్టం అక్టోబరు 1 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. అక్టోబరు 1 నుంచి ఈ చట్టం అమలు కానుంది. జనన మరణాలు నమోదు చట్టం – 2023 బిల్లును గత వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చే రైట్స్ ను ఉపయోగించి.. కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేయనుంది. అందుకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నుంచి జన్మించే వారికి జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేయనున్నారు. వ్యక్తి పుట్టినతేదీ, పుట్టిన ప్రదేశాన్ని సూచించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుతంతో పాటు రాష్టంలో ఇతర సేవలను వినియోగించుకునేందుకు ఈ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఉద్యోగ నియామకాల కోసం బర్త్ సర్టిఫికేట్ ను సింగిల్ డాక్యుమెంట్ లా వినియోగించుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Indian Railways: ఇకపై భారత్ రైళ్ళలో లోయర్ బెర్త్‌లు వారికే !!
Aditya-L1: పరిశోధనలు ప్రారంభించిన ఆదిత్య ఎల్1 సూర్యుడి దిశగా ప్రయాణం !!
బ్యాక్టీరియా సోకిన చేప తిని.. కాళ్లూచేతులు పోగొట్టుకున్న మహిళ !!
దొంగ చేతికి తాళాలు అంటే ఇదేనేమో !! సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన చోరీ దృశ్యాలు
Sampoornesh Babu: మార్టిన్ లూథర్ కింగ్ తో మళ్లీ రేసులోకి సంపూర్ణేశ్ బాబు