ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మా ఉద్యోగాలు మాకే కావాలి. ఇదే నినాదం కొంత కాలంగా కర్ణాటకలో ప్రతిధ్వనిస్తోంది. దీంతో అక్కడి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామకాల్లోనే కాదు.. ప్రైవేటు రంగంలోనూ స్థానికులకే పెద్ద పీట వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది కర్ణాటక సర్కార్‌.

ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

|

Updated on: Jul 20, 2024 | 9:00 PM

మా ఉద్యోగాలు మాకే కావాలి. ఇదే నినాదం కొంత కాలంగా కర్ణాటకలో ప్రతిధ్వనిస్తోంది. దీంతో అక్కడి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామకాల్లోనే కాదు.. ప్రైవేటు రంగంలోనూ స్థానికులకే పెద్ద పీట వేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్‌ సంస్థల్లో కిందిస్థాయి ఉద్యోగాలను వందశాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది కర్ణాటక సర్కార్‌. కన్నడిగులకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్టు చెప్పారు సీఎం సిద్ధరామయ్య. విప్లవాత్మక బిల్లును రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది కర్నాటక ప్రభుత్వం. ఈ బిల్లు ప్రకారం ప్రైవేట్‌ సంస్థల్లోని గ్రూప్‌-సి, గ్రూప్‌-డి… పోస్టులను కచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కేటగిరిలో 50శాతం మందిని, నాన్‌మేనేజ్‌మెంట్‌ కేటగిరీలో 70శాతం మందిని… కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్నాటకలోని ఏ ప్రైవేట్‌ సంస్థకైనా ఈ రూల్‌ను తప్పనిసరి చేయబోతోంది ప్రభుత్వం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి

రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!

ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు

కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

Follow us