ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు
నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులకు కష్టాలు మొదలవనున్నాయి. కరోనా సమయంలో రైల్వేబోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనలు చేపట్టారు.
నారాయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ నెల 19 నుంచి మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌లలో స్టాప్ ఎత్తివేస్తూ రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులకు కష్టాలు మొదలవనున్నాయి. కరోనా సమయంలో రైల్వేబోర్డు అధికారులు నారాయణాద్రి, విశాఖ, చెన్నై రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలపకుండా ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల ప్రయాణికులు ఆందోళనలు చేపట్టారు. అప్పటి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులను కలిసి విన్నవించడంతో ఏడాది క్రితం రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏడాది పాటు రైళ్లను నిలిపేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ సమయం ఈ నెల 19తో ముగియనుంది. ఆ రోజు నుంచి విశాఖ, నారాయణాద్రి, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లకు రైల్వే ఐఆర్‌సీటీసీ అధికారులు మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్‌లకు రిజర్వేషన్లు నిలిపివేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు నల్గొండలో కూడా స్టాప్ ఎత్తివేశారు. తిరుపతి వెళ్లే మిర్యాలగూడ డివిజన్ ప్రయాణికులు నల్గొండలో అర్ధరాత్రి 3 గంటలకు రైలు దిగి బస్సుల్లో ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: