AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అపర కుబేరుడు మన్సా మూసా  సంపద ముందు ఎలన్‌ మస్క్‌ కూడా వేస్టే

అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్‌ మస్క్‌ కూడా వేస్టే

Phani CH
|

Updated on: Jul 20, 2024 | 9:01 PM

Share

మన్సా మూసా .. క్రీ.శ. 1312 నుంచి 1337 మధ్య ఆయన పాలనలో ఆఫ్రికాలోని మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈయన ఒక రాజు మాత్రమే కాదు.. మహా చక్రవర్తి. అంతేనా..మహాబలుడు కూడా. ఇంకా చెప్పాలంటే.. ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే 400 బిలియన్ల డాలర్లు. అంటే ప్రస్తుతం విశ్వకుబేరుడిగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఆయన దగ్గర ఉండేది. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు.

మన్సా మూసా .. క్రీ.శ. 1312 నుంచి 1337 మధ్య ఆయన పాలనలో ఆఫ్రికాలోని మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. ఈయన ఒక రాజు మాత్రమే కాదు.. మహా చక్రవర్తి. అంతేనా..మహాబలుడు కూడా. ఇంకా చెప్పాలంటే.. ఆయన సంపద ప్రస్తుతం లెక్కిస్తే 400 బిలియన్ల డాలర్లు. అంటే ప్రస్తుతం విశ్వకుబేరుడిగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఆయన దగ్గర ఉండేది. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన మరో వ్యక్తి ఇప్పటి వరకు లేరు. కుబేరులకే కుబేరుడు మన్సా మూసా. ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్‌, గాంబియా, గినియా, నైగర్‌, నైజీరియా, చాద్‌, మారిటేనియా దేశాలు కలిపిన విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు. దీన్ని ‘మాలి’ విశాల సామ్రాజ్యం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న మాలిలోని టింబుక్టును నిర్మించింది ఆయనే. దీని కోసం పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండం నుంచి వేల మంది నైపుణ్యమైన పనివాళ్లను రప్పించారు. క్రీ.శ. 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. మూసా సామ్రాజ్యంలో బంగారు గనులు ఎక్కువగా ఉండటంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద దేశానికి తరలివచ్చింది. మూసా ‘హజ్‌ యాత్ర’కు బయలుదేరినప్పుడు.. మార్గమధ్యంలో ఈజిప్టులో ఆగి ఆ దేశ పాలకుడికి భారీగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. యాత్రకు ఆయన దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు. యాత్ర నుంచి వచ్చిన అనంతరం టింబక్టు నగరంతో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేశాడు. ఆ కాలంలో మాలిలోని విద్యా కేంద్రాలకు సుదూర తీరాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్‌ ఔట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం

600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి

రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!

ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు