మనుషులకు స్నానం చేయించే మెషీన్స్.. చూస్తే భలే ఉన్నాయే వీడియో
ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లు చూస్తున్నాం. బట్టలు ఉతికి ఆరేసినట్టు మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మెషీన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే.. మెషీన్ టబ్‌లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు.. కొద్ది నిమిషాల తర్వాత తళతళలాడే శరీరంతో బయటకు రావొచ్చట!
హాయిగా నచ్చిన సంగీతం వింటూ, సినిమా చూస్తూ 15 నిమిషాల్లో స్నానం పూర్తిచేయాలనుకునే వారి కోసం ‘ ఏ సైన్స్ కో’ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా మానవ వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర మూడు కోట్ల రూపాయలు.ఈ మెషీన్‌లోని ఏఐ.. ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును అంచనా వేసి వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ నిర్ణయిస్తుంది. మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్ ఇంజినీర్లు దీనిని తయారు చేశారు. యుద్ధ విమానం కాక్‌పిట్ ఆకారంలోని ప్లాస్టిక్ పాడ్‌లోకి మనిషి ప్రవేశించాక.. అది సగానికిపైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. ఆ తర్వాత అందులోని హైస్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతుంది. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపర్చేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట.
మరిన్ని వీడియోల కోసం :