Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!

Gaganyaan Mission: గగన్ యాన్ ప్రాజెక్ట్ లో కీలక ప్రయోగం.. ఇస్రో సిద్ధం !!

Phani CH

|

Updated on: Oct 22, 2023 | 9:48 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. గగన్ యాన్. ఈ మానవ సహిత ప్రాజెక్టుకు ముందు అక్టోబరు 21న మానవ రహితంగా ఓ ప్రయోగం చేస్తారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్‌ సిస్టంతో కూడిన గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ–డీ1 ను ప్రయోగిస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగ వేదికనుంచి దీనిని ప్రయోగిస్తారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. గగన్ యాన్. ఈ మానవ సహిత ప్రాజెక్టుకు ముందు అక్టోబరు 21న మానవ రహితంగా ఓ ప్రయోగం చేస్తారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్‌ సిస్టంతో కూడిన గగన్‌యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ–డీ1 ను ప్రయోగిస్తారు. శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ లోని మొదటి ప్రయోగ వేదికనుంచి దీనిని ప్రయోగిస్తారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టం భూమికి 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి, ప్యారాచూట్ల సహాయంతో తిరిగి భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను అంతరిక్షంలోకి పంపిస్తారు. తరువాత దానిని సురక్షితంగా బంగాళాఖాతంలో దించుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్

రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు

రెస్టారెంట్‌కు వెళ్లి పీకలదాకా తిని.. గుండెనొప్పి అంటూ..

కదులుతున్న కారు టాప్‌పై టపాసులు కాల్చుతూ హల్‌చల్‌