పురుషులకు అందుబాటులోకి గర్భనిరోధక ఇంజెక్షన్
భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తొలిసారి పురుషుల కోసం ప్రత్యేకంగా ఓ గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. సుధీర్ఘకాలం పాటు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే ఈ ఇంజెక్షన్‌కు రివర్సిబిలిటీ ఉండడం మరో విశేషం. అంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు దీనివల్ల ఎలాంటి అడ్డంకి ఉండదన్నమాట. అయితే, దీనిని రివెర్సిబుల్ ఎలా చేస్తారన్న విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించలేదు.
భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే తొలిసారి పురుషుల కోసం ప్రత్యేకంగా ఓ గర్భనిరోధక ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది. సుధీర్ఘకాలం పాటు అవాంఛిత గర్భాన్ని అడ్డుకునే ఈ ఇంజెక్షన్‌కు రివర్సిబిలిటీ ఉండడం మరో విశేషం. అంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు దీనివల్ల ఎలాంటి అడ్డంకి ఉండదన్నమాట. అయితే, దీనిని రివెర్సిబుల్ ఎలా చేస్తారన్న విషయాన్ని ఐసీఎంఆర్ వెల్లడించలేదు. ఏడేళ్లపాటు 303 మంది పురుష వాలంటీర్లపై పరిశోధనలు జరిపిన అనంతరం ఐసీఎంఆర్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ పరిశోధనలో దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వెల్లడి కాలేదని పేర్కొంది. అధ్యయన ఫలితాలు ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ ఆండ్రాలజీలో ప్రచురితమయ్యాయి. పరిశోధనల్లో భాగంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్యనున్న వాలంటీర్లకు 60 మిల్లీ గ్రాముల ఇంజక్షన్‌ను ఇచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు గ్రామాల ప్రజలను కంగారుపెడుతున్న దున్నపోతు
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో

