ఉలవలు స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయా ?? రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయా ??

|

Dec 25, 2024 | 1:15 PM

ఉలవలు అంటే పశువులకు దానాగా మాత్రమే పెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ అవి మనుషులు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. వీటివల్ల కలిగే బెనిఫిట్స్‌ తెలిసిన చాలా కొద్దిమంది మాత్రమే ఉలవలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఉలవలతో చారు, వడలు ఇలా చాలా రకాల డిషెస్‌ తయారు చేసుకోవచ్చు.

ఒకసారి ఉలవచారును టేస్ట్‌ చేస్తే.. అస్సలు వదిలిపెట్టరు. ఉలవలలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఫైబర్‌ ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌, జింక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో యాంటీ-అడిపోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-హైపర్ కొలెస్ట్రాలెమిక్ లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఉలవలను డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలు ఉంటాయి. వీటిలో బీ1, బీ2, బీ6, సీ, విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారానికి సమానమైన ప్రోటీన్‌ కూడా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉలవలు తీసుకోవటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఉలవలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !! ఈ జంట లవ్ స్టోరీ తెలుసుకోండి సరదాగా

అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!

చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..

క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..