ఐఫోన్‌ తయారీలో కుప్పం ముద్ర

Updated on: Aug 30, 2025 | 1:01 PM

మొబైల్‌ బ్రాండ్లలో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. ఐఫోన్‌ చేతిలో ఉన్నదంటే వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు జనం. అలాంటి ఐఫోన్‌ తయారీలో ఏపీ అది కూడా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ముద్ర పడనుంది. దీంతో కుప్ప నియోజకర్గం దశ తిరగబోతుంది. ఐఫోన్‌ చాసిస్‌ తయారీకి వినియోగించే ముడిపదార్థం ప్లాంట్‌ కుప్పంలో ఏర్పాటు కాబోతుంది.

మొబైల్‌ బ్రాండ్లలో ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. ఐఫోన్‌ చేతిలో ఉన్నదంటే వారిని ప్రత్యేకంగా చూస్తుంటారు జనం. అలాంటి ఐఫోన్‌ తయారీలో ఏపీ అది కూడా సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ముద్ర పడనుంది. దీంతో కుప్ప నియోజకర్గం దశ తిరగబోతుంది. ఐఫోన్‌ చాసిస్‌ తయారీకి వినియోగించే ముడిపదార్థం ప్లాంట్‌ కుప్పంలో ఏర్పాటు కాబోతుంది. ఇందుకోసం రూ. 586 కోట్లతో అల్యూమినియం యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రఖ్యాత కంపెనీ హిందాల్కో ముందుకు వచ్చింది. ఈ సంస్థ ప్రతిపాదనలకు గురువారం ఎస్‌ఐపీబీ ఆమోద ముద్ర కూడ లభించింది. కుప్పంలో ఈయూనిట్‌ ఏర్పాటైతే 613 మందికి ఉపాధి దొరకనుంది. హిందాల్కో ప్లాంట్‌లో 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ ఎలక్ట్రానిక్స్‌ కాంపొనెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ పాలసీ 2025-30 కింద ఆమోదం తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఐఫోన్ బాడీలను కూడా తయారు చేస్తారు. ఇప్పటికే బెంగళూరులో ఐఫోన్‌ తయారీ యూనిట్‌ ప్రారంభమైంది. ఇక్కడకి సమీపంలోని కుప్పంలో ఈ ప్లాంట్‌ రాబోతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌ ఆంధ్రప్రదేశ్‌ అతి త్వరలోనే భాగస్వామ్యం కాబోతుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో టెక్నాలజీ పరంగా కుప్పం ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందంటున్నారు టెక్‌ నిపుణులు. అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో బీచ్.. సముద్ర తీరాన్ని తలదన్నేలా ఏర్పాట్లు

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్ ఏడాది సంపాదన ఎంతో తెలుసా?

Tribanadhari Barbarik: త్రిబాణధారి బార్బరిక్.. హిట్టా..? ఫట్టా..?

Bullet Train: ఏపీలో బుల్లెట్‌ రైలు పరుగులు