జనసేన కార్యకర్త కొడుకును భుజంపైకి ఎక్కించుకున్న పవన్‌ కల్యాణ్‌.. వీడియో

|

Mar 26, 2025 | 11:19 AM

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. శనివారం కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా టీడీపీ, జనసైనికులు తరలివచ్చారు.

కర్నూల్ స‌భ‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఓ కార్య‌కర్త త‌న బిడ్డ తలకు ఎర్రటి తువ్వాలు చుట్టి.. అచ్చం పవన్ కళ్యాణ్ లా రెడీ చేసి తీసుకు సభకు తీసుకువచ్చాడు. సభలో అతను ప‌వ‌న్ కంట ప‌డటంతో వెంటనే ఆ బుడ్డోడిని స్టేజ్ మీద‌కి తీసుకురావాలని చెప్పారువేదిక మీద‌కు వచ్చిన అబ్బాయిని అప్యాయంగా పలకరించాడు. ఎత్తుకుని భుజం మీద కూర్చోపెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇదే స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఓజీ ఓజీ అని నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ కనిపిస్తే చాలు.. ఆయన అభిమానులకు పూనకాలు రావ‌డం కామ‌న్. ఓజీ సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి కల్యాణ్ ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తూనే ఉన్నారు.

మరిన్నివీడియోల కోసం: 

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

గ్రోక్తో సారీ చెప్పించుకున్న డైరెక్టర్ వీడియో

వీరు మాత్రం హలీమ్‌ తినకూడదంట! వీడియో

భర్తను హత్య చేసి..ప్రియుడితో హోటల్‌లో ఆరురోజుల పాటు..!