Billionaire: విమాన ప్రమాదం.. బిలియనీర్ కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు..!
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం... భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా వార్తల ద్వారా తెలిసింది.
జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం… భారత్‌కు చెందిన మైనింగ్ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా వార్తల ద్వారా తెలిసింది. బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్న విమానం… మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా.. అది పొలంలోకి దూసుకెళ్లేలోపే.. గాల్లోనే పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరూ జింబాబ్వే దేశీయులు. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్‌వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్ డాలర్లు.. అంటే రూ.33 వేల కోట్లకు పైగా ఆస్థి ఉన్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..