At Home Ceremony: రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. తెలంగాణ సీఎం కేసీఆర్ గైర్హాజరు..
Independence Day 2023: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. తెలంగాణ కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రాజ్ భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. తెలంగాణ కేబినెట్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
రాజ్ భవన్ లో తమిళిసై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బిల్లులపై స్పందించేందుకు ఇది సరైన సమయం కాదన్నారు గవర్నర్. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

