పిండి పదార్థాలు తగ్గించి ప్రొటీన్ పెంచండి వీడియో
ఆహారం, జీవనశైలి మార్పులకు, ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులకు మధ్య సంబంధం ఉందని దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ జరిపిన తాజా స్టడీలో తేలింది. బీపీ, కొలెస్ట్రాల్, అధిక బరువు, డయాబెటిస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాధారణ విషయంగా మారిందని ఐసీఎంఆర్ హెచ్చరికలు చేసింది. 40 ఏళ్ల వయసున్న 18,000 మందిపై జరిపిన అధ్యయనంలో మూడింట ఒక వంతుకి హై బీపీ, 9 శాతం మందికి డయాబెటిస్, 41 శాతం మందికి ఫ్రీ డయాబెటిస్ ఉన్నట్లు స్పష్టమైంది. ఊబకాయం పెరుగుదల వార్నింగ్ బెల్స్ మోగిస్తుందట.
గ్రామాలతో పోల్చినప్పుడు పట్టణవాసులు ధూమపానం, మద్యపానం చేయడం తక్కువే. కానీ శారీరక శ్రమ లేక అధిక బరువుతో, హైపర్ టెన్షన్ తో పట్టణవాసులు బాధపడుతున్నారు. జంక్ ఫుడ్, ఆహారపు అలవాట్ల వల్ల ఈ రిస్క్ ఎక్కువైందట. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ సూచనలు చేసింది. కార్బోహైడ్రేట్లకు బదులుగా ప్రోటీన్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, మొలకలు, ఉడకబెట్టిన గుడ్లు, చేపల ద్వారా ఆరోగ్యకరమైన ప్రోటీన్ లభిస్తుందని తెలిపింది. మనం రోజూ తీసుకునే వరి అన్నం, గోధుమలు, పంచదారలో కార్బోహైడ్రేట్లు అధికం. దీంతో ప్రజలలో ప్రోటీన్ల కొరత విపరీతంగా ఉందని, ఈ లోపం తీవ్రంగా కనిపిస్తుందని క్లియర్ కట్ గా చెప్పింది. తెల్లగా రిఫైన్ చేసి వరి అన్నానికి బదులు గోధుమలు లేదా చిరుధాన్యాలను తినడం వల్ల మధుమేహం, ఊబకాయం రాకుండా నివారించవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
