మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత

|

Oct 18, 2023 | 9:51 AM

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పోలీసులు నిఘా పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ మియాపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 27 కేజీల 540 గ్రాముల బంగారం, దాదాపు 16 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పోలీసులు నిఘా పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ మియాపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 27 కేజీల 540 గ్రాముల బంగారం, దాదాపు 16 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల రూపంలో తరలిస్తున్న బంగారం, వెండిని గుర్తించిన పోలీసులు వాటికి సంబంధించిన బిల్లులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 14 కోట్ల 70 లక్షలు విలువ చేసే సొత్తును సీజ్ చేసి మియాపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్‌ఓటీ పోలీసులు. ఎన్నికల్లో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నగదు అక్రమ తరలింపును అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టారు. అక్టోబరు 16న మియాపూర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో బంగారం, వెండి బయటపడ్డాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??

ఈ ఆఫీసర్‌ మహా స్ట్రిక్ట్‌.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..

లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్‌ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు

ఆ పొలంలో అడుగు పెట్టాలంటే భయపడుతున్న జంతువులు.. ఎందుకంటే ??

సలాం రాఖీ భాయ్.. నీకు నువ్వే సాటి.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు