హైదరాబాద్‌లో కిడ్నాప్‌ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన CCTV దృశ్యాలు

హైదరాబాద్‌లో కిడ్నాప్‌ కథ సుఖాంతం.. నిందితులను పట్టించిన CCTV దృశ్యాలు

Janardhan Veluru

|

Updated on: Apr 28, 2023 | 2:48 PM

హైదరాబాద్‌లో కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది.  అఫ్జల్‌గంజ్‌లో ఫుట్ పాత్‌పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్‌కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. 

హైదరాబాద్‌లో కిడ్నాప్‌ ఘటన కలకలం సృష్టించింది.  అఫ్జల్‌గంజ్‌లో ఫుట్ పాత్‌పై నుంచి 2 నెలల పాప కిడ్నాప్‌కు గురైయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.  ఉప్పు గూడ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారి ఆచూకీని కాచిగూడ రైల్వే పోలీసులు కనిపెట్టారు. ఘటన స్థలానికి చేరుకొని చిన్నారిని పోలీసులు కాపాడారు. ఇద్దరు నింధితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. రెండు మాసాల పాప కిడ్నాప్ కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

Published on: Apr 28, 2023 02:45 PM