కొంపముంచిన హీటర్.. డ్రైవర్ సజీవదహనం!
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఘోర కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో హీటర్ ఆన్ చేసి డ్రైవర్ నిద్రపోవడంతో మంటలు చెలరేగి దుర్గాప్రసాద్ అనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. డోర్లు తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయాడు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. కారు శామీర్‌పేట నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై కారు దగ్ధమైన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. డ్రైవర్ హీటర్ ఆన్ చేసుకుని పడుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీటర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని… డ్రైవర్ నిద్రలేచి డోర్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నించినా అవి తెరుచుకోకపోవడంతో సజీవదహనం అయ్యాడని చెబుతున్నారు పోలీసులు. శామీర్‌పేట నుంచి కీసర వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మంటల్లో సజీవ దహనమైన డ్రైవర్ హనుమకొండ ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్నేహమంటే ఇదేరా.. నీటిలో పడ్డ ఏనుగు పిల్ల.. దాని ఫ్రెండ్స్ ఏం చేసేయంటే !
కార్తికేయతో ప్రియాంక చోప్రా, సితార ఫొటో వైరల్
పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. చివరికి !!
ఉద్యోగి 40 ఏళ్ళ సేవలను మెచ్చుకొని సన్మానం
రన్నింగ్ ట్రైన్‌లో వంటలు చేసిన మహిళ.. ఇండియన్ రైల్వే ఏం చేసిందంటే
