Own House Dream: సొంతింటి కల నెరవేరేదెలా.? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన.?
ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది జీవితంలో చాలామందికి పెద్ద లక్ష్యం. సొంతింటి కల సాకారానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. మధ్యతరగతి వారు ఆర్థికంగా ఈ భారాన్ని మోయడం కష్టంగా మారింది. భూముల ధరలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తుసామగ్రి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ. ఇవన్నీ కలిపితే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది.
ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది జీవితంలో చాలామందికి పెద్ద లక్ష్యం. సొంతింటి కల సాకారానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. మధ్యతరగతి వారు ఆర్థికంగా ఈ భారాన్ని మోయడం కష్టంగా మారింది. భూముల ధరలతో పాటు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తుసామగ్రి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు జీఎస్టీ. ఇవన్నీ కలిపితే ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతోంది. అందుకే ప్రభుత్వం గృహ నిర్మాణానికి సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన చేస్తుందా అని గంపెడాశతో చూస్తున్నారు. గృహ రుణానికి సంబంధించి వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24B ప్రకారం 2 లక్షల రూపాయిల వరకు మినహాయింపు ఉంది. కానీ ఇప్పుడున్న ఇళ్ల ధరలను దృష్టిలో పెట్టుకుని దీనిని ఐదు లక్షలకు అయినా పెంచాలన్న డిమాండ్ ఉంది.
హోమ్ లోన్ అసలు చెల్లింపుపై సెక్షన్ 80C కింద లక్షన్నర వరకు మినహాయింపు ఉంటుంది. కానీ ఇదే సెక్షన్ 80Cలోకి చాలా రకాల మినహాయింపులు వస్తాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, స్కూలు ఫీజులు అన్నీ దీని కిందే ఉంటాయి. కానీ ఈ సెక్షన్ కింద మినహాయింపు వచ్చేది కేవలం లక్షన్నర రూపాయిలకే. అందుకే ఈ సెక్షన్ నుంచి హోమ్ లోన్ అసలు చెల్లింపును తొలగించి.. దానికి ప్రత్యేకంగా మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అలాగే వాస్తవ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని.. సెక్షన్ 80C మినహాయింపును 3 లక్షలకు పెంచాలని ట్యాక్స్ పేయర్స్ కోరుతున్నారు. దీంతోపాటు లోన్ సాయంతో ఫస్ట్ టైమ్ ఇల్లు కొనేవారు చెల్లించే వడ్డీకి.. ఎలాంటి లిమిట్ లేకుండా పూర్తిగా ట్యాక్స్ ఎగ్జింప్షన్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఉంది.
ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇల్లు కొంటే వారికి సెక్షన్ 80EEA ప్రకారం.. వారి హోమ్ లోన్ కు చెల్లించే ఇంట్రస్ట్ లో 50 వేల రూపాయిల వరకు మినహాయింపు ఇచ్చేవారు. కానీ దానిని కొవిడ్ తరువాత.. అంటే 2022 మార్చిలో తీసేశారు. నిజానికి ఈ సదుపాయం ఉండడం వల్ల ట్యాక్స్ కట్టేవారికి కాస్త పన్ను తగ్గేది. అందుకే ఈ ఫెసిలిటీని మళ్లీ కోరుకుంటున్నారు.
ట్యాక్స్ పేయర్స్ కు ఇప్పుడు రెండు పన్ను విధానాలు అందుబాటులో ఉన్నాయి. కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం.. ఈ రెండింటిలో ఏ విధానాన్ని అయినా వారు ఎంచుకోవచ్చు. కానీ కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు గతంలో రెండున్నర లక్షలు ఉండేది. తరువాత దీనిని 3 లక్షలకు పెంచారు. ట్యాక్స్ రిబేట్ సంగతి చూస్తే.. ఐదు లక్షలు ఉన్న ఈ మొత్తాన్ని 7 లక్షలకు పెంచారు. కానీ పన్ను శ్లాబులు మాత్రం ఆరు నుంచి ఐదుకు తగ్గిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.