మెడ చుట్టూ నల్లగా మారిందా? ఇదిగో పరిష్కారం

Updated on: May 19, 2025 | 3:47 PM

కొంతమందిలో మెడ చుట్టూ నల్లగా మారి అందవిహీనంగా కనబడుతుంది. అలాంటి సమస్య ఉన్నవారికి కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మెడ చుట్టూ ఉన్న నలుపు త్వరలోనే తగ్గిపోతుందని అంటున్నారు. రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్ తో కొద్దిగా పెరుగు కలిపి మెడకు రాసి మసాజ్ చేసి బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి స్కిన్ ని క్లీన్ చేస్తాయి. ఓట్స్ లో పెరుగు కలిపి మెడ చుట్టూ స్క్రబ్ లా చేయడం వల్ల మెడ భాగంలో నలుపు తగ్గుతుంది. బేకింగ్ సోడతో ప్యాక్ వేసుకుంటే మెడపై ఉన్న నల్లని చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మేలు చేస్తుంది. చర్మంపై మురికిని తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చర్మం వృధాకణాలను తొలగించి యవ్వనపు కాంతిని అందిస్తుంది. చర్మాన్ని మాయిశ్చరైజర్ చేస్తుంది. బంగాళదుంప కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారంగా చెప్పవచ్చు. బంగాళదుంప రసాన్ని మెడకు రాసి కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే త్వరలోనే నలుపు తగ్గుతుంది. కలబంద చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చే సామర్థ్యం ఉంటుంది. మెలనీన్ ఉత్పత్తికి కారణమయ్యే ఎంజైమ్ చర్యను నిరోధించడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కలబంద గుజ్జును మెడకు అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి చల్లటి నీళ్లతో వాష్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే మెడ నలుపు తగ్గుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? పెద్ద ఆపదలో ఉన్నట్టే..!

ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు

బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..

వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ