Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? పెద్ద ఆపదలో ఉన్నట్టే..!

రోజంతా ఏసీలోనే కూర్చుని ఉంటున్నారా..? పెద్ద ఆపదలో ఉన్నట్టే..!

Phani CH

|

Updated on: May 19, 2025 | 3:45 PM

వేసవి వచ్చిందంటే 24 అవర్స్ ఏసీలు ఆన్లోనే ఉంటాయి. ఎండ తట్టుకోలేక రోజంతా ఏసీలోనే కూర్చుంటారు చాలామంది. ఇలాంటి వారు పెద్ద ఆపదలో ఉన్నట్లే అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. నిరంతరం ఏసీలో కూర్చోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు.

నిపుణుల అధ్యయనాల ప్రకారం ఏసీ కూలింగ్లో ఎక్కువసేపు ఉండే వ్యక్తులు సగటు వ్యక్తులకంటే జీవక్రియ రేటు తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతున్నారని చెబుతున్నారు. ఏసీ గదుల్లో ఎక్కువ టైం ఉండటం మంచిది కాదంటున్నారు. ఏసీలో ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వల్ల ఊబకాయం పెరిగి వేగాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ ఊబకాయం, డయాబెటిస్, హృదయ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను పెంచుతుందని చెబుతున్నారు. ఏసీ ఉష్ణోగ్రత, ఎముకలు, ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా నిశ్చల జీవనశైలికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఏసీలో ఎక్కువ సమయం గడిపితే శారీరక శ్రమ దాదాపు తగ్గిపోతుంది. దీనివల్ల బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలోని కండరాల పనితీరు తగ్గుతుంది. నరాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతో నరాలు బలహీనంగా మారుతాయి. కొందరిలో తలతిప్పడం, వాంతులు కూడా అవుతూ ఉంటాయి. చాలామందిలో తలనొప్పి కూడా మొదలవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏఐ ను కూడా వదలరా మావ.. ప్రేమలో పడిన మహిళ.. చివరకు

బస్సులో సీటు కోసం.. జుట్టు జుట్టు పట్టుకుని.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

బావ సై అన్నాడు.. భర్తను నై అన్న మహిళ.. చివరికి వామ్మో అలానా..

వాడి కన్ను గుడి మీద పడిందా ?? ఇక నగలన్నీ కనుమరుగే.. చోరీ లో రికార్డు సృష్టించిన దొంగ

నల్ల యాలకులతో దిమ్మతిరిగే ఆరోగ్య ప్రయోజనాలు..?