AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు

|

Nov 06, 2023 | 1:17 PM

ఆంధ్రప్రదేశ్ లో అనేక గ్రామాల్లోని ప్రజలు వర్షాలు లేక నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని ప్రకటించింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబరు ఎనిమిదో తేదీకల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది.

ఆంధ్రప్రదేశ్ లో అనేక గ్రామాల్లోని ప్రజలు వర్షాలు లేక నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ ఏపీ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని ప్రకటించింది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబరు ఎనిమిదో తేదీకల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రంపైకి తూర్పుగాలులు వీస్తుండడంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు భారీవర్షాలు కురిశాయి. రాబోయే మూడు రోజుల్లో కూడా అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం,సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.