Rains in AP: ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని....బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం నవంబర్ 27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్రంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీలంక ట్రింకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వాయుగుండం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారి జగన్నాధకుమార్ టీవీ9 కు తెలిపారు. ఈనెల 29న దక్షిణ కోస్తా, రాయలసీమ లోని కొన్ని జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని… 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.