Pomegranate Leaves: ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా..? ఔషధంలా పనిచేస్తున్న దానిమ్మ.

|

Sep 14, 2024 | 4:41 PM

దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది నిజం. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. సీజనల్‌ దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందడానికి దానిమ్మ ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

దానిమ్మ పండు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇది నిజం. ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. సీజనల్‌ దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందడానికి దానిమ్మ ఆకుల కషాయాన్ని తయారు చేసి రోజుకు రెండుసార్లు త్రాగాలి. ఇవే కాకుండా వివిధ రకాల చిన్న ఆరోగ్య సమస్యలకు దానిమ్మ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి.

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్టు వ్యాధి, చర్మ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఆకులు నిద్రలేమికి బెస్ట్ రెమిడీ అని చెబుతారు. ఒక పాత్రలో మూడు వంతుల నీరు తీసుకొని, దానిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి ఆ నీళ్లలో వేసి.. వాటర్ సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి రోజూ రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది మీకు నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. దురద, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే దానిమ్మ ఆకులను పేస్ట్ చేసి రాసుకుంటే నయమవుతుంది. అంతేకాదు శరీరంలోని పుండ్లు, గాయాలకు దీన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది.

నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిపూత ఉంటే దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దానిమ్మ ఆకులను పేస్ట్ లా చేసి మొటిమల మీద రాస్తే ముఖం మచ్చలు లేకుండా తయారవుతుంది. అంతేకాదు, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలతో బాధపడుతుంటే, రోజూ రెండు టీస్పూన్ల దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.