Spinach: బచ్చలికూరతో మెరిసే అందం.. ఒక్కసారి ట్రై చెయ్యండి.

|

May 13, 2024 | 3:59 PM

ఆకుకూరలు ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా ఇస్తాయి. అలాంటివాటిలో బచ్చలి కూర ఒకటి. నిజంగా బచ్చలి కూర బంగారమనే చెప్పాలి. ఒక్కసారి బచ్చలికూరను ఫేస్‌ప్యాక్‌గా వేసుకొని చూడండి.. మీరే ఆశ్చర్యపోతారు. బచ్చలికూర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషణ, ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఇంట్లోనే బచ్చలికూర ఆకులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుకూరలు ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా ఇస్తాయి. అలాంటివాటిలో బచ్చలి కూర ఒకటి. నిజంగా బచ్చలి కూర బంగారమనే చెప్పాలి. ఒక్కసారి బచ్చలికూరను ఫేస్‌ప్యాక్‌గా వేసుకొని చూడండి.. మీరే ఆశ్చర్యపోతారు. బచ్చలికూర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషణ, ఆరోగ్యవంతంగా మార్చడంలో సహాయపడతాయి. ఇంట్లోనే బచ్చలికూర ఆకులతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలి కూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖంలోని మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. బచ్చలికూరలో విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మొటిమలు కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ముఖంపై మచ్చలను కూడా తగ్గిస్తుంది. బచ్చలికూరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ రెండూ ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

బచ్చలికూర ఫేస్‌ ప్యాక్‌ కోసం.. కొన్ని బచ్చలికూర ఆకులను తీసుకొని ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి. దానికి ఒక చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మొత్తానికి అప్లై చేయాలి.15 నిమిషాలు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయండి. అలాగే రెండు చెంచాల బచ్చలికూర రసంలో ఒక చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించి 10 నుండి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఫేస్‌ బాగా ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. రెండు చెంచాల శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్ల బచ్చలికూర పేస్ట్‌, పాలు, కొద్దిగా నీటిని వేసి బాగా కలపండి. కావాలంటే, ఇందులో రోజ్ వాటర్ కూడా యాడ్‌ చేసుకోవచ్చు. తర్వాత ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత కడగాలి. అయితే ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు బచ్చలి కూర ఆకులను తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించండి. కొందరికి దీని వాడకం వల్ల అలర్జీ రావచ్చు. అలాంటి వారు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on