Harassment: ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..

|

Jul 15, 2024 | 8:08 AM

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. జూలై 9న మృతిచెందిన యువతి మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు, స్థానికులు తెలిపారు. మాడుగులపెల్లి మండలం చింతలగూడేనికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కొత్త కల్యాణి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు.

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది. జూలై 9న మృతిచెందిన యువతి మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు, స్థానికులు తెలిపారు. మాడుగులపెల్లి మండలం చింతలగూడేనికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కొత్త కల్యాణి చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు. జూలై 6న తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని వారి బంధువొకరు చనిపోగా కల్యాణి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. వారి కుమారుడు కళాశాలకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. అప్పటికే గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకు నల్గొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులు చికిత్స పొందిన కల్యాణి జూలై 9న మృతి చెందింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మాడ్గులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కల్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి, న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపటంతో నిరసన విరమించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on