కొత్త సంవత్సరం వేళ భారతీయులు ప్రపంచ రికార్డ్‌ను నమోదు చేశారు. గుజరాత్‌లో ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ప్రసిద్ధ మోధేరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో 4 వేలకు మందికి పైగా ఈ సూర్య నమస్కార యోగా క్రమాన్ని ప్రదర్శించారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాల్ని ప్రదర్శించారు. ఇందులో విద్యార్థులు, యోగా ఔత్సాహికులు, సీనియర్ సిటిజన్‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు హోం మంత్రి హర్ష సంఘవి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ హాజరై.. సూర్య నమస్కారాల విషయంలో గుజరాత్ సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు చేసిందని చెప్పారు. అత్యధిక మంది ఏకకాలంలో సూర్య నమస్కారం చేయడం ఇదే మొదటిసారని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క రోజులో రూ. 460 కోట్ల లిక్కర్ తాగేశారు
Sudigali Sudheer: సైలెంట్‌గా.. ట్విస్ట్ ఇచ్చిన గాలోడు
Rakul Preet Singh: గుడ్ న్యూస్.. రకుల్ పెళ్లి.. డేట్ ఫిక్స్