తెలంగాణలో ఉచిత కరెంట్‌ పొందాలంటే అది తప్పనిసరి

|

Feb 08, 2024 | 9:01 PM

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఉచిత విద్యుత్‌ అందించేదుకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అర్హులైన కుంటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తొలి దశలో రేషన్‌కార్డ్‌, ఆధార్‌, సెల్‌ ఫోన్ నెంబర్లు కరెంట్‌ కనెక్షన్లకు అనుసంధానమై ఉన్న ఇళ్లకు ఉచిత కరెంట్‌ సరఫరా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం.

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే ఉచిత విద్యుత్‌ అందించేదుకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. అర్హులైన కుంటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. తొలి దశలో రేషన్‌కార్డ్‌, ఆధార్‌, సెల్‌ ఫోన్ నెంబర్లు కరెంట్‌ కనెక్షన్లకు అనుసంధానమై ఉన్న ఇళ్లకు ఉచిత కరెంట్‌ సరఫరా చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మూడిటిని ప్రాతిపదికగా తీసుకొని అర్హులైన కుటుంబాలను గుర్తించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేపట్టారు. ఇటీవల ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81,54,158 మంది దరఖాస్తులిచ్చారు. వీటిలో 30 శాతం మంది రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్లను సరిగా నమోదు చేయలేదు. తనిఖీల్లో భాగంగా విద్యుత్‌ సిబ్బంది ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు. దరఖాస్తుదారుల్లో 10 లక్షల మందికి అసలు రేషన్‌కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలిదశలో ఉచిత కరెంటు సరఫరా సాధ్యం కాదని సమాచారం. ఇక రాష్ట్రమంతటా విద్యుత్‌ సిబ్బంది వివరాలు సేకరణ పూర్తయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనేది తెలుస్తుందని, అనంతరం ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని సమచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనాల నెంబర్‌ ప్లేట్స్‌ను TS నుంచి TGగా మార్పు

Mumbai: ముంబై తీరంలో అనుమానాస్పద పడవ కలకలం.

గడ్డ కట్టేసిన సముద్రం.. ఊపిరాడక అల్లాడిపోతున్న తిమింగలాలు

TOP9 ET: RRR రికార్డును బ్రేక్‌ చేసిన యానిమల్ | పవన్‌ ఫ్యాన్స్ ఓవర్‌ యాక్షన్ తగలబడిపోయిన థియేటర్..

Follow us on