నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??
తెలంగాణలో అకాల వర్షం..అపార నష్టాన్ని మిగులుస్తోంది. కల్లాల్లో ధాన్యం... కళ్లల్లో దైన్యం.. అన్నట్లుంది అన్నదాతల పరిస్థితి.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది..పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. సుమారు గంటపాటు వడగళ్లు విరుచుకుపడ్డాయి.ఈ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది..చేతికొచ్చిన పంట కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ల వాన ఆదిలాబాద్ అన్నదాతను కుదేలు చేసింది..చేతికొచ్చిన మొక్క జొన్న , జొన్న , నువ్వులు, వరి, మిరప పంటలు కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అకాల వర్షం..అపార నష్టాన్ని మిగులుస్తోంది. కల్లాల్లో ధాన్యం… కళ్లల్లో దైన్యం.. అన్నట్లుంది అన్నదాతల పరిస్థితి.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది..పలు చోట్ల వడగళ్లు పడ్డాయి. సుమారు గంటపాటు వడగళ్లు విరుచుకుపడ్డాయి.ఈ ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది..చేతికొచ్చిన పంట కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ల వాన ఆదిలాబాద్ అన్నదాతను కుదేలు చేసింది..చేతికొచ్చిన మొక్క జొన్న , జొన్న , నువ్వులు, వరి, మిరప పంటలు కోల్పోయి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈదురు గాలుల దెబ్బకు జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, పొగాకు పంటలు నేలకొరిగాయి..నిర్మల్ జిల్లాలోనూ తీవ్ర పంట నష్టం వాటిల్లింది.. 650 ఎకరాల్లో మొక్క జొన్న నువ్వుల పంట, 303 ఎకరాల్లోమొక్క జొన్న, 120 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది..ఈదురు గాలులతో కూడిన వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలర్ట్.. పిడుగులు పడొచ్చు !! మూడు రోజులు జాగ్రత్త..
బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. నెట్టింట ఫొటోలు వైరల్
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పై దుండగుల దాడి.. గాయాన్ని లెక్క చేయక పోరాటం