Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ స్వీట్స్.. తిన్నారంటే..
హైదరాబాద్ నగరం, తియ్యటి స్వీట్లకు పెట్టింది పేరు..ఇటీవలి రోజుల్లో ఈ స్వీట్ షాపులు డేంజర్ జోన్‌లో చిక్కుకున్నాయి.. ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయట పడుతున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి. కర్ణ ఆదేశాలతో 69 స్వీట్ షాప్స్ లో తనిఖీలు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. నాణ్యతా ప్రమాణాలపై నిర్లక్ష్యం వహిస్తుండటంతో 10 స్వీట్ షాపులు సీజ్ చేశారు. LB నగర్ సర్కిల్‌లో 3, RC పురం సర్కిల్‌లో 2 షాపులు సీజ్ చేశారు. కొత్తపేట, చార్మినార్, రామంతపూర్, శేరిలింగంపల్లి సర్కిల్, అల్వాల్‌లో ఒక్కో షాపుకు తాళం వేశారు. స్వీట్ షాపుల్లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్ పైరీ డేట్ లేదని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోకుండా పనిచేస్తున్నారని చెప్పారు. కిచెన్ లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. FSSAI సర్టిఫికెట్స్ ఎక్స్ పైర్ అయినా రెన్యువల్ చేయించుకోకుండా స్వీట్ షాప్స్ నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంతో ఇట్లాంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. కలర్ కోటింగ్ స్వీట్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు వైద్యులు..జీర్ణవ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటాయి.. దీంతో నిబంధనలు పాటించని షాపులను మూసివేయడం, జరిమానాలు విధించడం, చట్టపరమైన కేసులు నమోదు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు..కానీ కొంతమంది సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..హైదరాబాద్ నగర ప్రజల్లో ఆందోళన కలుగుతుంది..తమకు ఇష్టమైన స్వీట్లు తినడానికి ప్రజలు భయపడుతున్నారు.. డబ్బులు ఇచ్చి మరి రోగాన్ని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ వాపోతున్నారు..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్
బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..
దూసుకొస్తున్న డేంజరస్ డేట్.. భయంతో వణికిపోతున్న జపాన్!
అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

