వందే భారత్ స్లీపర్ రెడీ.. త్వరలో పట్టాలపై పరుగులు
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్ మరో రెండు నెలల్లో పటాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు కూర్చుని ప్రయాణించేందుకు వీలుండే ఈ వందేభారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనుంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్లకు ఆగస్టు 15 నాటికి ట్రయల్ నిర్వహించనున్నట్లు వివరించారు.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్ మరో రెండు నెలల్లో పటాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు కూర్చుని ప్రయాణించేందుకు వీలుండే ఈ వందేభారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనుంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్లకు ఆగస్టు 15 నాటికి ట్రయల్ నిర్వహించనున్నట్లు వివరించారు. వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండు నెలల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి వస్తుందనీ ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారని చెప్పారు. ప్రయాణికులకు ఆత్యాధునిక మెరుగైన సౌక్యరాలతో అందించనుందనీ దాదాపు 200 కిమీ వేగంతో ప్రయాణించేలా ఈ స్లీపర్ రైళ్లను రూపొందించామని అన్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ 1, టూ – టైర్ ఏసీ 4, త్రీ టైర్ ఏసీ 11 కంపార్ట్మెంట్లతో మొత్తం 16 బోగీలతో ఈ రైళ్లను తయారు చేశారని మంత్రి తెలిపారు. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఛైర్‌కార్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య సర్వీసులను అందిస్తున్నాయి. ఇక మరిన్ని మెరుగైన సదుపాయలు కల్పించడంలో భాగంగా దాదాపు 40 వేల సాధారణ కోచ్‌లను అధునాతన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మారుస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డీజే సిద్ధార్థ్‌కు డ్రగ్స్ పాజిటివ్.. ఎవరీ సిద్దార్థ్ ??
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా
ఆలస్యంగా వచ్చారో.. అంతే సంగతులు… కేంద్రం కొత్త రూల్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

