AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!

పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!

Phani CH
|

Updated on: Jun 29, 2026 | 10:00 PM

Share

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతుండటంతో భారతీయులు పాత బంగారు ఆభరణాలను భారీగా విక్రయిస్తున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే సుమారు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. దీంతో దేశీయ గోల్డ్ రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతం లభిస్తోంది. రీసైకిల్ బంగారం వినియోగం పెరగడంతో దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాలలో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. రికార్డు స్థాయి ధరలతో కొంతకాలంగా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన బంగారం ధరలు.. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధరలు మరింత పడిపోతాయనే భయంతో భారతదేశంలోని అనేక కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను విక్రయించడానికి మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే రెండో పెద్ద దేశమైన భారత్‌లో, రీటైల్ ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారులలో నెలకొన్న అప్రమత్తతకు ఈ తాజా ట్రెండ్ అద్దం పడుతోంది. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ అందించిన సమాచారం ప్రకారం.. కేవలం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే వినియోగదారులు దాదాపు 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించారు. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 43 శాతం వృద్ధి. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.1.8 లక్షల నుండి రూ.1.4 లక్షలకు పడిపోవడంతో, రానున్న రోజుల్లో ఇది మరింతగా రూ.1.2 లక్షలకు తగ్గుతుందనే అంచనాలు వినియోగదారుల్లో నెలకొన్నాయి. అందుకే పాత నగల స్థానంలో కొత్తవి తీసుకునే సాంప్రదాయాన్ని పక్కనబెట్టి, నేరుగా నగదుగా మార్చుకుని లాభాలు పొందుతున్నారు. ఈ మార్పు దేశీయ బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు పెద్ద ఊపునిస్తోంది. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారం మార్కెట్లోకి రావడం వల్ల జ్యువెలర్లకు నిరంతరాయంగా ముడిసరుకు లభిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది గోల్డ్ పాయింట్ల నెట్‌వర్క్ కలిగిన సంస్థల్లో పాత బంగారం సేకరణ 40 శాతం పెరిగింది. దీనిని శుద్ధి చేసి మళ్లీ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంగా మారుస్తున్నారు. భారతదేశం 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 7240 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అయితే ప్రస్తుత ధోరణి చూస్తుంటే, గతంలో 125 నుండి 150 టన్నులుగా ఉన్న రీసైకిల్డ్ బంగారం వాటా, రాబోయే రోజుల్లో ఏకంగా 200 నుండి 250 టన్నులకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ గృహాలలో దాదాపు 30,000 టన్నుల భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు ఒక అంచనా. ఇలా ఇళ్లలోని నిరుపయోగ బంగారం మార్కెట్ చలామణిలోకి రావడం వల్ల విదేశీ దిగుమతులపై దేశం ఆధారపడటం క్రమంగా తగ్గుతూ, దేశీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యా.. న్యూట్రిషనిస్ట్ కథ వైరల్

1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!

తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. పండ్ల బాక్స్‌లో ఉన్నది చూసి గుండె గుభేల్‌!

Follow Us