దేశంలో నకిలీ ORS బ్యాన్.. పోరాడి గెలిచిన డా.శివరంజని
నకిలీ ఓఆర్ఎస్ పేరుతో మార్కెట్‌లో అమ్ముడవుతున్న ఎనర్జీ డ్రింక్స్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధం విధించింది. ఈ డ్రింక్స్‌లో అధిక చక్కెర పిల్లలకు, డయాబెటిక్ రోగులకు ప్రమాదకరం. డా. శివరంజని ఎనిమిదేళ్లుగా సాగించిన పోరాటం ఫలితంగా వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఈ విధానంపై చర్యలు తీసుకున్నారు.
దేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయించే కంపెనీలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌పై ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడకూడదని స్పష్టం చేసింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డీహైడ్రేషన్ నివారణ పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన పలు ఎనర్జీ డ్రింక్స్‌లో వాస్తవ ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్) ఫార్ములాలో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుందని డా. శివరంజని ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ అధిక చక్కెర పిల్లలకు డయేరియాను పెంచి ప్రాణాంతకంగా మారుతుందని, డయాబెటిక్ రోగులకు కోమాకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు. ఇప్పుడు డా. శివరంజని పోరాటం ఫలించి, ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్రీన్ క్రాకర్స్ తో కాలుష్యానికి చెక్..మరి వాటిని గుర్తుపట్టడం
విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’
ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??
వీధి కుక్కల్ని ఇంటికి తెచ్చిన భార్య .. విడాకులు కోరిన భర్త వీడియో
ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?ఫోన్ పేలుద్ది జాగ్రత్త వీడియో
అర్ధరాత్రి కారు బీభత్సం..దగ్గరకు వెళ్లి చూడగా వీడియో
సారూ.. కాస్త ‘వైఫ్’ని వెతికి పెట్టరూ..? వీడియో
రూ.1.5 కోట్ల ఫ్లాట్.. పెన్సిల్‌తో గోడకు రంధ్రం ? వీడియో
ఆకాశం అంచులు తాకిన మోనో రైలు వీడియో
నడిరోడ్డుమీద భార్యను నరికి చంపాడు..కారణం ఇదే వీడియో

