వాయుకాలుష్యం.. పురుషులపై ఎఫెక్ట్‌ !! 5 లక్షల మందిపై అధ్యయనం

|

Sep 09, 2024 | 8:45 PM

వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వాయు కాలుష్యానికి గురైన పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వాయు కాలుష్యానికి గురైన పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకటి సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30 నుంచి 45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30 నుంచి 45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు పెరగాలంటే వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు నివారించాల్సిన అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది. నాణ్యమైన గాలిని పొందడం మానవ హక్కు అని, కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలని సూచించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి హీనా ఖాన్‌కు మరో షాక్

అవును.. రాజ్‌తరుణ్‌ నిందితుడే పోలీసుల చార్జిషీట్‌

కోల్‌కత ట్రైనీ డాక్టర్‌ పై జరిగింది గ్యాంగ్ రే***ప్‌ కాదా ??

66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా

ఈ దొంగ.. వినాయక చవితి రోజే గణేశుడి లడ్డూ కొట్టేశాడు !!