Papads Benefits: డైట్‌ చేసేవారు అప్పడాలు తినవచ్చా.? నిపుణులు ఏమంటున్నారు?

|

Jul 11, 2024 | 4:48 PM

ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చక్కగా రసం చేసుకొని, నాలుగు అప్పడాలు వేయించుకొని వేడి వేడిగా భోజనం చేసేస్తారు చాలామంది. ఇక అప్పడాలు అంటే ఇష్టపడేవారు ప్రతిరోజే భోజనంలో అప్పడాలు తింటూనే ఉంటారనుకోండి అది వేరే సంగతి. కొందరైతే స్నాక్స్‌ ఏమీ లేనప్పుడు అప్పడాలను వేయించుకొని ఓ పట్టు పడుతుంటారు. మరి ఈ అప్పడాలు ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది? డైట్‌ చేసేవారు అప్పడాలు తినవచ్చా ?

ప్రముఖ డైటీషియన్ ప్రకారం.. అప్పడాల్లో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి పోషకాలతోపాటు ఐరన్‌ కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. అప్పడాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ, దాని తయారీ నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అప్పడాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. భోజనంలో వీటిని తింటే, శరీరంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచుతుంది. అంతేకాకుండా, అప్పడాలు పూర్తిగా గ్లూటెన్-ఫ్రీగా ఉంటాయి. కాబట్టి మీకు అలెర్జీ సమస్య ఉన్నప్పటికీ, అప్పడాలను సురక్షితంగా తినవచ్చు. అప్పడాల్లో సోడియం అధికంగా ఉంటుంది. అయితే కొందరు సోడియం తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటుంటారు. అలాంటి వారు వీటిని తినకూడదు. ఇది శరీరంలో సోడియం స్థాయిని పెంచుతుంది. సోడియం స్థాయిలు తక్కువగా లేదా సాధారణంగా ఉంటే, ప్రతిరోజూ అప్పడాలు తినవచ్చు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించే ముందు మీ వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on