AP News: ఆ బావి దగ్గర నుంచి వింత శబ్దాలు.. ఏంటని వెళ్లి చూడగా రైతుల గుండె గుభేల్

| Edited By: Ravi Kiran

Dec 14, 2024 | 9:40 AM

గుప్త నిధుల వేటగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. అతి పురాతన శివలింగాన్ని ధ్వంసం చేశారు. శివలింగం కింద ఏమైనా గుప్తనిధులు ఉన్నాయేమోనన్న అనుమానంతో దాన్ని ధ్వంసం చేశారు.

నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో అతి పురాతన బావి ఉంది. బావి చుట్టూ అందంగా నిర్మాణం చేపట్టారు. ఆ పక్కనే పురాతన శివలింగం కూడా ఉంది. ఈ శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. గురువారం ఉదయమే శివలింగం ధ్వంసమై ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా నాలుగేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం ఇదే ఆలయంలో తవ్వకాలు జరిపారు. అప్పట్లో నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దుండగులు పదేపదే ఆలయంలో తవ్వకాలు జరుపుతూ ఉండటం పురాతన శివలింగం, నంది విగ్రహాలను ధ్వంసం చేయడం లాంటివి జరిగినా కూడా కఠిన చర్యలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తరతరాలుగా పూజలు చేస్తున్న శివలింగం, నంది విగ్రహం ధ్వంసం కావడంతో గ్రామస్తులు అరిష్టంగా భావిస్తున్నారు. ఇప్పుడైనా దృష్టి పెట్టి గుప్తనిధుల వేటగాళ్లను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి