Samantha Post: టాలీవుడ్ లో వాయిస్ ఆఫ్ ఉమెన్. షాక్ ఇచ్చిన సమంత రియాక్షన్.!

|

Sep 04, 2024 | 12:12 PM

మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ లో 290 పేజీలు సమర్పించింది,సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ నివేదికలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు రెమ్యూనరేషన్ లో వివక్ష, లోకేషన్లలో కనీస సౌకర్యాలలేమితో ఇబ్బందులు పడుతున్నారని కమిటీ పేర్కొంది.

మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ లో 290 పేజీలు సమర్పించింది,సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ నివేదికలో మహిళలు లైంగిక వేధింపులతో పాటు రెమ్యూనరేషన్ లో వివక్ష, లోకేషన్లలో కనీస సౌకర్యాలలేమితో ఇబ్బందులు పడుతున్నారని కమిటీ పేర్కొంది. ఈ నివేదిక కేవలం మలయాళ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హీరోయిన్ సమంత కూడా రియాక్టయ్యారు.

తన ఇన్‌స్టా స్టోరీలో మెన్షన్ చేశారు. కమిటీ పనితీరును ఆమె అప్రిషియేట్ చేస్తూనే.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ – WCC నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదికను సిద్ధం చేయగలిగిందన్నారు. ఇక సమంత హేమ కమిటీ రిపోర్ట్‌ పై తన ఇన్‌స్టాస్టోరీలో ఏం రాసుకొచ్చారంటే.. “కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది.కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాదంటూ సమంత చెప్పింది. తాను ఒక్కొక్కరి గురించి స్పందించలేనని.. ప్రతి రంగంలోనూ కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారని సమంత అంది. తాను గత ఎనిమిదేళ్లుగా తెలుగు.. తమిళ సినీ పరిశ్రమల్లో పని చేస్తున్నాని.. తన తొలి సినిమానే పెద్ద విజయం సాధించడంతో తనకు ఎప్పుడూ ఎక్కడా ఇబ్బంది తలెత్తలేదని ఆమె స్పష్టంచేసింది. సినీ పరిశ్రమలో ఎన్నో మంచి విషయాలు జరుగుతుంటాయని.. తనకీ ఇండస్ట్రీ అంటే చాలా చాలా ఇష్టమని.. ఇక్కడే తాను ఎందరో మంచి.. గొప్ప వ్యక్తుల్ని కలిశానని సమంత అంది.

దాంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల పైన మేము జస్టిస్ హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు 2019లో నెలకొల్పిన ” ది వాయిస్ ఆఫ్ ఉమెన్” కూడా WCC గ్రూప్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. టాలీవుడ్ లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయడానికి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని సమంత ట్వీట్ చేశారు.

ఈ విషయంపై తమిళ సినీ పరిశ్రమ నుంచి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోలీవుడ్ లోనూ ఓ కమిటీ వేయాలని తమిళ నటుడు విశాల్ అన్నారు. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదని చెబుతూ.. సారీ అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. అలాగే తమిళ సినీ పరిశ్రమకు కమిటీ అవసరమా? లేదా అన్నది కూడా తెలియదు సూపర్ స్టార్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలో పెను దుమారం సృష్టిస్తోన్న విషయం రజినీకి తెలియకపోవడం ఏంటీ ? అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.