TOP9 ET: వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం | పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒక్కడే కాదు.. సిద్దు జొన్నలగడ్డ, బన్నీ వాసు, విశ్వక్ సేన్, త్రివిక్రమ్‌, నాగ వంశీ, చినబాబు కూడా తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..! నటసింహం బాలయ్య! ఇద్దరిలో ఎవరు గోట్! ఇద్దరిలో ఎవరు తోప్‌ !

TOP9 ET: వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం | పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?

|

Updated on: Sep 04, 2024 | 10:10 AM

01.NTR: వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒక్కడే కాదు.. సిద్దు జొన్నలగడ్డ, బన్నీ వాసు, విశ్వక్ సేన్, త్రివిక్రమ్‌, నాగ వంశీ, చినబాబు కూడా తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటించారు.

02.Pawan: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..! నటసింహం బాలయ్య! ఇద్దరిలో ఎవరు గోట్! ఇద్దరిలో ఎవరు తోప్‌ ! ఇది నెట్టింట ఎట్ ప్రజెంట్ నడుస్తోన్న చర్చ. రీసెంట్‌గా విజయ్‌ గోట్ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు.. బాలయ్యను ది గోట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే ఈవెంట్లో మాట్లాడిన హీరోయిన్ మీనాక్షి చౌదరి.. పవన్‌ కళ్యాణ్‌ ది గోట్ అంటూ.. చెప్పారు. దీంతో నెట్టింట బాలయ్య వర్సెస్ పవన్.. ఇద్దరిలో ఎవరూ గోట్ అనే కొశ్చన్ రెయిజ్ అయింది. తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న నెటిజన్లకు ఇదో టాపిక్ అయిపోయింది.

03.NTR: చరిత్ర సృష్టించిన యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. చుట్టమల్లే సాంగ్‌కు వస్తున్న రెస్పాన్స్‌తో ఓ రేర్‌ ఫీట్‌ క్రియేట్ చేశారు. ఇక అనిరుద్‌ కంపోజింగ్‌లో వచ్చిన ఈ సాంగ్‌ సెప్టెంబర్‌2 ఒక్క రోజే.. మ్యూజిక్ ప్లాట్‌ ఫాం స్పాటిఫైలో.. మిలియన్ స్ట్రీమింగ్స్‌ ను దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సాంగ్‌గా హిస్టరీ కెక్కింది. ఇక యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్‌ 100 మిలియన్ ను క్రాస్‌ చేసింది.

04.saripoda: రూ.100 కోట్ల దిశగా.. సరిపోదా శనివారం కలెక్షన్స్

సరిపోదా శనివారం మూవీ.. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఎడతెరపి లేకుండా వర్షాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమాకు రెస్పాన్స్ తగ్గకుండానే ఉంది. దాంతో ఈ మూవీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 100 క్రోర్ చేరువకు వచ్చింది. ఇక ఆగస్ట్ 29న వరల్డ్‌ వైడ్ రిలీజ్‌ అయిన ఈ మూవీ 5 రోజుల్లోనే 75.26 క్రోర్ గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ వీకెండ్ ముగిసే లోపు.. 100కోట్లు పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో వస్తోంది.

05.nani: దేవర రిలీజ్‌ రోజే.. నాని గుడ్ న్యూస్.

సరిపోదా శనివారం అంటూ వచ్చి… బాక్సాఫీస్‌ దగ్గర సరిపోయినంత హిట్టు కొట్టిన నాని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్‌ రోజే ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న వరల్డ్‌ వైడ్ ఓ పక్క థియేటర్లలో దేవర కత్తి దూస్తున్నవేళ… ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య కోపంతో ఊగిపోనున్నాడు. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్‌ పై అఫీషియల్‌గా… నెట్‌ఫ్లిక్స్ కానీ.. నాని టీం కానీ ఏం చెప్పనప్పటికీ.. సెప్టెంబర్‌ 27నే సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చేస్తోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది.

06.balayy: వారసుడి ఫిల్మ్ ఎంట్రీపై బాలయ్య అనౌన్స్‌మెంట్.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ.. బాలయ్య వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీపైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. అందరి మాటలు ఈ జూనియర్ లయన్ ఎంట్రీ గురించే మాట్లాడుకుంటున్నాయి. అలాంటి ఈ సిట్యూవేషన్లోనే మోక్షజ్జ ఎంట్రీ పై నోరు విప్పి మాట్లాడారు బాలయ్య. తొందర్లో సినిమా ఫైనల్ అవుతుందని చెప్పారు. తన కొడుకు మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయని.. తొలి చిత్రం రిలీజ్‌ కాకుండానే మోక్షు స్టార్ కూడా అయిపోయాడని అన్నారు బాలయ్య. అంతేకాదు ఐదారు స్క్రిప్ట్స్ సిద్దంగా ఉన్నాయని.. లాంఛింగ్ గురించి తనకు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పారు.

07.Mahesh: సింపుల్‌గా మహేష్ అబ్బాయి బర్త్‌ డే.

సిల్వర్ స్క్రీన్‌ పై గ్రాండ్‌గా ఉన్నా.. బయట సింపుల్‌గా.. సైలెంట్‌గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన కొడుకు గౌతమ్ బర్త్‌ డే ను కూడా అలాగే సెలబ్రేట్ చేశారు. ఆగస్ట్‌ 31 తో తన కొడుకు 18వ పడిలోకి అడుగుపెట్టడంతో.. గౌతమ్‌ ఫ్రెండ్స్‌ మధ్యలోనే.. చాలా సింపుల్‌గా కేక్ కట్‌ చేయించారు మహేష్. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా మహేష్ వైఫ్‌ నమ్రత.. తన సోషల్ మీడియా హ్యాండిల్‌ ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇక దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

08.NTR: కాంతార2 లో యంగ్ టైగర్ NTR?

త్వరలో దేవరతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్‌. రీసెంట్‌గా కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. కాంతార ప్రీక్వెల్‌లో నటిస్తున్నారని వార్తలొస్తున్నాయనే ప్రశ్న అక్కడ ఎదురైంది తారక్‌కి. రిషబ్‌శెట్టి తనకోసం ఓ కేరక్టర్‌ ప్లాన్‌ చేస్తే, నటించడానికి తనకేం అభ్యంతరం లేదన్నారు తారక్‌. దీంతో కాంతార ప్రీక్వెల్‌లో తారక్‌ నటిస్తున్నారనే మాటలు జోరందుకున్నాయి.

09.sree: ఏకంగా కల్కినే బీట్ చేసిన శ్రద్దా కపూర్ సినిమా.

శ్రద్దా కపూర్, రాజ్‌ కుమార్‌ రావ్ కాంబోలో తెరకెక్కిన స్త్రీ2 మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఆ కలెక్షన్స్‌ ఫిగర్స్‌తో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌నే షేక్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్‌ కల్కి మూవీ కలెక్షన్స్‌నే బీట్ చేసింది స్త్రీ2 మూవీ. ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి మూవీ టాప్‌లో ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాను వెనక్కి నెట్టి.. స్త్రీ2 ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకుంది. విడుదలైన 18 రోజుల్లో 502 కోట్లు దక్కించుకుని బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us